బోయినపల్లి: భూమాత శాంతించాలని నైవేద్యాలు

బోయినపల్లి మండలంలో మహిళలు తడగొండలో శుక్రవారం భూమాతకు బూరెలను నైవేద్యంగా చేసి భూమా త శాంతించాలని పూజలు చేశారు. ఇటీవల జిల్లాలో భూమి కంపించింది. పూర్వం నుండి ఎప్పుడైన భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే శాంతిస్తుందని నమ్మకం. భూ మాత శాంతించాలని మహిళలు వారి ఇంటి ముందు మట్టి తీసి తవ్విన గోతిలో మట్టిలో ముగ్గు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి బూరెలు పూడ్చారు. భూమాత శాంతించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్