మల్లాపూర్ లో పేకాడుతున్న ఆరుగురి అరెస్ట్

పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం అరెస్ట్ చేశామని బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులోని మానేరు వాగులో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన ప్రకటించారు. వారి వద్ద నుంచి రూ. 8, 200 నగదు, 6 సెల్ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్