మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ కోరారు. మే 15న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని అన్నారు. చొప్పదండి ముదిరాజ్ భవన్లో గురువారం జరిగిన సమావేశంలో మహాధర్న పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు.