భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ సూచించారు. మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్ సధస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ధర్మపురి, బుగ్గారం తహసీల్దార్లు మాజీద్, కృష్ణ చైతన్య, రెవిన్యూ అధికారులు డిప్యుటీ తహసీల్దార్ శ్రీకాంత్, బుగ్గారం ఆర్ఐ బాపురెడ్డి, కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.