నీళ్లలో పరిచినట్లు కనిపిస్తున్న ఈ పాత వంతెన ధర్మపురి నియోజకవర్గంలోని రాయపట్నం వద్ద ఉంది. నీటిలో మునిగి ఉండగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా బయటకు తేలింది. దీంతో కొత్త వంతెన మీదుగా దీన్ని చూసిన వాహనదారులు సెల్ఫీలు తీసుకుంటూ తమ పాత ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.