ధర్మపురి: మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులు మంత్రిని శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. అనంతరం ఆలయంలో సౌకర్యాల గురించి మంత్రి ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్