జమ్మికుంట: మార్కెట్కు 3 రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం బుధవారం తెలిపారు. ఈనెల 14న (శుక్రవారం) హోలీ పండుగ సందర్భంగా సెలవు, 15న (శనివారం) వారాంతపు యార్డు బంద్, 16న(ఆదివారం) సాధారణ సెలవు ఉండనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి 17న (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్