ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగింది. సీఐ తిరుమల్ గౌడ్ వివరాల ప్రకారం ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్ వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేసు నమోదయింది.