తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని హుజురాబాద్ కి చెందిన ఓ క్యాన్సర్ పేషెంట్ కోరుకుంటోంది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన కూతురి చివరి కోరికను తీర్చాలంటూ ఆమె తల్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ బుధవారం రాశారు. 'నా కూతురు స్వాతి (25) బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడటమే తన చివరి కోరిక. దయచేసి ఆయనను కలిపించండి' అని తల్లి రజిత రాసిన లేఖ వైరలవుతోంది.