హుజూరాబాద్: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్ లోని ఇందిరానగర్ లో జరిగింది. పోలీసుల కథనమిలా. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్