జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన అన్నమనేని సుప్రియ (35) దుబాయిలో ఆత్మహత్య చేసుకుంది. సుప్రియ భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె దుబాయిలో భర్త వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఎప్పటిలాగే భర్త శ్రీనివాస్ రావు ఆఫీస్‌కు వెళ్లగా పిల్లలు స్కూల్‌కు వెళ్లారు.
తిరిగి వచ్చి చూసేసరికి సుప్రియ విగత జీవిగా పడి ఉండటంతో బోరున విలపించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.