జగిత్యాల రాజకీయాలపై బీఆర్ఎస్ నేతల భేటీ

శనివారం రాత్రి హైదరాబాద్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ MLA విద్యాసాగర్ రావు, మాజీ ZP ఛైర్‌పర్సన్ దావ వసంత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మాజీమంత్రి జీవన్ రెడ్డి BRS పార్టీలోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్