జగిత్యాల: విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు అబాకస్

విద్యార్థుల నైపుణ్యాలను వెలికతీసేందుకు అబాకస్ ఎంతో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో అబాకస్ ఉచిత శిక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్‌, వేదగణితం, స్పీడ్‌మాథ్స్‌ లాంటి ప్రత్యేక శిక్షణ అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్లగట్ట గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్