జగిత్యాల: కన్నతల్లిదండ్రులను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు

జగిత్యాల పట్టణం వాణీ నగర్ కు చెందిన వృద్ధ దంపతులు బట్టు శంకర్ (78), అనసూయ (74) అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తమను పోషించకుండా, ఇంట్లోంచి వెళ్లిపోవాలని వేధిస్తున్న కొడుకు హరీష్, కోడలు జయలపై తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం జిల్లా సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో వృద్ధురాలు అనసూయ తన గోడును విలేకరులకు వినిపిస్తూ రోధించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదుకు ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్