జగిత్యాల: ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియంలో రెనె హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్