జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బత్తిని పుష్ప (45) గుండెపోటుతో ఆదివారం మృతి చెందింది. కాగా మృతురాలి సోదరి శ్రీలత పుష్ప కళ్ళను దానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. సోమవారం ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పుష్ప కళ్లను సేకరించి సర్టిఫికెట్ ను మృతురాలి సోదరి శ్రీలతకు అందజేశారు.