జగిత్యాల: కొనుగోలు కేంద్రాల ద్వారానే కనీస మద్దతు ధర

ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలల్లోనే రైతులు ధాన్యం అమ్మి కనీస మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం పొలాస, అనంతారంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ రమాదేవి, నాయబ్ తహశీల్దార్ కార్తీక రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఎపిఎం వి. గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్