జగిత్యాల: మృతుడి కుటుంబానికి 5లక్షలు అందజేసిన ఎమ్మెల్యే

జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి ఇటీవల కరెంటు షాక్ తో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ జవహర్ నాయక్, నాయకులు వెంకట్రాజం, సాగర్ రావు, సొల్లు సురేందర్, శ్రీనివాస్ రెడ్డి, సుషీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్