భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు పాల్గొన్నారు.