జగిత్యాల: వార్డు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

జగిత్యాల పట్టణంలోని 12వ వార్డు నాయకులు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 12వ వార్డు ఉప్పరిపెట్ లో సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిన్నేని ప్రవీణ్ రావు, అక్రముద్దీన్, రాజేందర్, రంజిత్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్