జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శనివారం స్థలం పరిశీలన చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని ప్రజల కోరిక మేరకు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ నిబంధనల క్రమంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు.