జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శాంతి స్తూపం దగ్గర మిషన్ భగీరథ నీళ్లు వృదాగా పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో కింది కాలనీలకు నీటి సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మండల స్థాయి అన్ని శాఖల అధికారులు వేడుకలు నిర్వహించడానికి వచ్చారని, అయినప్పటికి సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు.