జగిత్యాల జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి బుద్ధ ప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల నుండి కిషన్ నాయక్ భీమదేవర పల్లికి, వరంగల్ నుండి సుజాతను జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ గా, అశోక్ కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ గా, మహమ్మద్ ఆసిఫోద్దీన్ ఆర్మూర్ నుండి మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ గా, ఇమ్రాన్ ఖాన్ ఖానాపూర్ నుండి మల్యాల సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ అయ్యారు.