గాలిపల్లి శివారులో జవారిపేట యువకుడి ఆత్మహత్య

మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన మెర్గు సంతోష్ గౌడ్ (35) అనే యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సంతోష్ గౌడ్ నర్సక్కపేట గ్రామంలోని పెద్దమ్మ తల్లీ ఆలయ సమీపంలో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు108కు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. మృతునికి భార్య జ్యోతి, ఇరువురు కుమార్తెలు శృతి, హార్షిత, కుమారుడు విశిత్ గౌడ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్