తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్,
ఉమ్మడి హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, ములుగు, నల్గొండ జిల్లాలో వర్షాలు పడతాయని వెల్లడించింది.