కరీంనగర్లోని ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. కరీంనగర్ కట్టరాంపూర్కు చెందిన ఓ కుటుంబ హుస్నాబాద్కు వెళ్లేందుకు కట్టరాంపూర్లో ఆటో ఎక్కి బస్టాండ్లో దిగారు. తాము ఎక్కిన ఆటోలో ఫోన్ మర్చిపోయారు. కట్టరాంపూర్కు చెందిన ఆటో డ్రైవర్ దుర్షేట్టి శశికుమార్ తిరిగి ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. గురువారం బస్టాండ్ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఫోన్ ను అప్పగించినట్లు తెలిపారు.