కరీంనగర్ బస్టాండ్ కు 44 ఏళ్లు పూర్తి

కరీంనగర్ బస్టాండ్ ఏర్పాటు చేసి శుక్రవారంతో 44 ఏళ్లు పూర్తిచేసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ కరీంనగర్ బస్టాండ్ కావడం విశేషం. 11 నవంబరు 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు కరీంనగర్ బస్టాండ్ కు శంకుస్థాపన చేశారు. డిసెంబరు 27, 1980న అప్పటి భారత విదేశాంగ శాఖామంత్రి పీవీ నరసింహరావు ప్రారంభించారు. బస్టాండ్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టింది. మొత్తం 44 ప్లాట్ ఫాంలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్