ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ ఆగస్టు 2న ఢిల్లీలో రాజ్యాంగ సవాళ్లపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సులో పాల్గొనేందుకు KNR కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నేతలు గురువారం ఢిల్లీ వెళ్లారు. స్టేట్ జాయింట్ కన్వీనర్ రజనీష్, జిల్లా వైస్ చైర్మన్ రాజు, జిల్లా కన్వీనర్లు శంకర్, శ్రీకాంత్, కోకన్వీనర్ సృజన్, రాజేశం, వేణుగోపాల్, బాలకిషన్ ఉన్నారు.