కరీంనగర్: దారుణం.. వృద్ధురాలి గొంతుకోసిన మహిళ

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామంలో మంగళవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. రావుల ప్రమీల అనే వృద్ధురాలి గొంతు కోసి నాలుగు తులాల బంగారం, రూ.40వేల నగదు దోచుకున్నారు. అదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప ఈ కిరాతకానికి పాల్పడిందని వృద్ధురాలు తెలిపింది. కుమారుడు రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్