కారును ఢీకొట్టిన కరీంనగర్ డైరీ మిల్క్ ట్యాంకర్

కరీంనగర్ డైరీ మిల్క్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ కారును ఢీకొన్న ఘటన పద్మనగర్ బైపాస్ లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం శుక్రవారం పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రమోద్ బంధువులతో ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పాల ట్యాంకర్ కారును వెనకాల నుంచి ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి డివైడర్ పైకెక్కింది. కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్