కరీంనగర్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురైన సంఘటన జరిగింది. గంగాధర మండలంలో గతనెల 25న మమత అనే మహిళ షాపుకి వెళ్లి తిరిగి రాలేదు. ఇటీవల ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో ఆమె సాన్నిహిత్యంతో ఉందని, ఆ కోపంతో అతని కుటుంబ సభ్యులు మమతను హత్య చేయించారని తెలిపారు.