కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లిలో కనకరాజు అనే వ్యక్తి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ప్రకారం కనకరాజు జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి తిరిగివచ్చాడు. మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఇంట్లో గొడవపడి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.