కరీంనగర్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్ పట్టణం శక్తి టెంపుల్ ఏరియాలోని సబ్ స్టేషన్ మరమ్మతుల్లో భాగంగా బుధవారం ఉదయం 8: 30 నుంచి 10: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని కరీంనగర్ టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు. శక్తి టెంపుల్ ఏరియా, బాలాజీ సూపర్ మార్కెట్, సంతోష్ నగర్, సంతోష్ మాత టెంపుల్ ఏరియాల్లో కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్