కొత్తపల్లి: నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ పరిశీలించి రోగుల వివరాలు, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎన్సీడీ రిపోర్టు, ఆభా, ఆరోగ్య మేళా కింద జరిగిన పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్