రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 13వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.