చిరుమామిడి మండల ఎస్ఐ ఆర్. సాయికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాంబో డాగ్తో తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి కోసం మండలంలోని కిరాణా షాపులు, పాన్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇకమీద మండలంలోని అనుమానం ఉన్న అన్ని షాపులను చెక్ చేయనున్నట్లు SI తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్లో గానీ, డయల్ 100 ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని కోరారు.