ప్రజలకు సేవలు అందించడంతోనే ఉద్యోగులకు, కార్మికులకు గుర్తింపు లభిస్తుందని నగర మేయర్ వై. సునీల్ రావు శుక్రవారం అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి విభాగం కార్మికుడు ఎలగందుల కొమురయ్య ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం సందర్భంగా సన్మానించి మాట్లాడారు.