జగిత్యాల: పిచ్చి కుక్క బీభత్సం.. 9 మందిపై దాడి

మెట్ పల్లి పట్టణంలోని బోయవాడ 14వ వార్డులో శుక్రవారం ఉదయం ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. పాఠశాలకు వెళ్తున్న 8 విద్యార్థులపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఆ ప్రాంతంలోని ఓ మహిళను కూడా అదే కుక్క కరిచి గాయపరిచింది. మొత్తం 9 మందిని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్