అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో వర్షానికి తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదని, తూకం వేసిన ధాన్యం తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.