జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండంలో తీవ్ర విషాదం నెలకొంది. వినాయక విగ్రహానికి విద్యుత్ వైర్లు తగిలి 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.