కోరుట్ల: అంగన్వాడి ఆయమ్మ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చులు అందజేత

జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కోరుట్ల అర్బన్ 1, అంబేద్కర్ నగర్ 2 సెంటర్ కు చెందిన ఆయమ్మ గంటెడి మంజుల అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, ప్రభుత్వం వారి అంత్యక్రియలకు పదివేల రూపాయలు నగదు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ మనమ్మ, సూపెర్వైసర్ భారతి, గంగారాం, అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సాయిశ్వరి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్