కోరుట్ల: ఆడపిల్లల భద్రతపై సఖి టీం అవగాహన

జగిత్యాల జిల్లా కోరుట్ల సరస్వతి శిశు మందిర్ లో శనివారం జగిత్యాల సఖి టీం ఆడపిల్లల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సఖి టీం సిఏ లావణ్య బృందం హైస్కూలు విద్యార్థులకు ఫోక్సో చట్టం విశిష్టతను వివరించారు. ఫోక్సో చట్టం వలన చెడు మార్గంలో పయనించేవారు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్