మెట్ పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులు, 14వ వార్డు కౌన్సిలర్ ఆర్మూర్ మర్రి పోచయ్య (56) గురువారం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరగా, గురువారం సాయంత్రం ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన పోచయ్యకి భార్య, కొడుకు, కూతురు ఉండగా, వారం రోజుల క్రితమే పోచయ్యకి మనవడు జన్మించాడు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జరిగే అవకాశాలు ఉన్నాయి.