దుబాయిలో యువకుడి మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం

జోగిన్ పల్లికి చెందిన కొండ్ర రాజేశ్ (37) దుబాయిలో ఈ నెల 3న చర్మ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. మూడు నెలల క్రితం దుబాయికి వెళ్లి కూలీ పని చేసుకుంటున్న రాజేశ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించగా, శుక్రవారం ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్