శంకరపట్నం మండలం కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2002-03 విద్య సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆనాడు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాల్లో పని చేస్తూ ప్రయోజకులైన విద్యార్థులను గురువులు అభినందించారు.