ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లికి చెందిన చక్రపాణి(43)కి తన భార్య, తల్లితో విభేదాలు ఏర్పడ్డాయి. పెద్దల సమక్షంలో అనేకసార్లు పంచాయతీ జరగడంతో మనస్తాపానికి గురైన చక్రపాణి గురువారం గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని అన్న అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.