కమాన్ పూర్: ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహద పడతాయని తహసిల్దార్ వాసంతి అన్నారు. కమాన్ పూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజల కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించామని, వేసవిలో తీవ్ర ఎండలలో దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి కార్యాలయంలోనే చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్