పెద్దపల్లి: ప్రణాళిక బద్ధంగా మల్లన్న ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే

ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఓదెలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి తాజాగా దేవాదాయ శాఖ కొత్త పాలకవర్గాన్ని నియమించింది. గురువారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే సన్మానించి పాలకవర్గం సభ్యులను అభినందించారు.

సంబంధిత పోస్ట్