పెద్దపల్లి: వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు: కలెక్టర్

వేసవికాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్లో వేసవిలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. వేసవిలో తాగునీటి సరఫరా కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలని, గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడవద్దని, జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్