పెద్దపల్లి: ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో సోమవారం నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు కాంట్రాక్టర్ వద్ద నుండి రూ. 20వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రోడ్డుపైనే ఏఈ లంచం తీసుకుంటుండగా,, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన అధికారిని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్